ఘనంగా కవ్వంపెళ్లి జన్మదిన వేడుకలు
ప్రజాపక్షం/ఇల్లంతకుంట
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను కార్యకర్తలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బస్ స్టాండ్ ఆవరణలో మండల అధ్యక్షుడు పసుల వెంకట్,యువజన కాంగ్రెస్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అనంతగిరి వినయ్ ఆధ్వర్యంలో ముందుగా కేకు కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి డాక్టర్ సత్యనారాయణ అని ప్రశంసించారు. అనునిత్యం ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి ప్రతి నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలే నా దేవుళ్ళు, ప్రజా సేవే నా దైవం అనుకుంటూ, మేలు కోరే వ్యక్తి అని కొనియాడారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని భగవంతున్ని వేడుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చిట్టి ఆనంద రెడ్డి, రజినీకాంత్, వీరేశం, నరేందర్ రెడ్డి, బడుగు లింగం, జుట్టు నగేష్, మామిడి నరేష్, రమణారెడ్డి, సురేష్, బాలయ్య, ముజాఫర్, రామకృష్ణారెడ్డి, లచ్చయ్య, సురేందర్ రెడ్డి ,నేరెళ్ల విజయ్, ప్రసాద్ ,అనిల్, ఆది రెడ్డి ,తిరుపతి ,భగవాన్ రెడ్డి, రాజయ్య ,బాలయ్య, శేఖర్ ,సంతోష్, నారాయణ, మల్లయ్య, సాగర్, అంజయ్య, నరసయ్య, రమణ, అనంతగిరి ,శ్రీనివాస్, మల్లయ్య, రాజు యాదవ్, రాజేశం, దాస్, బాబు ,శంకర్ ,రమేష్, నారాయణ రెడ్డి, మధు, లక్ష్మణ్, హైదర్, జమాల్, బషీర్, లక్ష్మణ్, చందు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.




