ప్రాంతీయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపిదే విజయం

63 Views

*స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి *

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బీజేపీ సభ్యత్బం పై ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మూగ జయ శ్రీ పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా జయ శ్రీ మరియు రఘునాథ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బిజెపి సభ్యత్వానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ సభ్యత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర పార్టీ విధించిన లక్ష్యం మేరకు ప్రతి మండలంలో సభ్యత్వం చేయించాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అనుకున్న లక్ష్యం మేరకు బీజేపీ సభ్యత్వం చేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం అని కాబట్టి ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకు బీజేపీ సభ్యత్వం అందించి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించాలని తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎన్నికల సమయంలో ఇచ్చిన్ హామీలు అమలు లో ప్రభుత్వం. పూర్తిగా విఫలం అయ్యిందని 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం తధ్యం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంగందుల కృష్ణ మూర్తి, పట్టి వెంకట కృష్ణ, గాదె శ్రీనివాస్, తుల ఆంజనేయులు, అక్కల రమేష్, జోగుల శ్రీదేవి, మాధవరపు వెంకట రమన రావు, వంగపల్లి వెంకటేశ్వర రావు, స్వామి రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్