ముస్తాబాద్, జనవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): దొంగతనం కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 200/- రూ. జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనం చేసిన వ్యక్తి వేములవాడ మండలం పాజిల్ నగర్ గ్రామానికి చెందిన శివరాత్రి సంపత్ గుర్తించిన నాటి పోలీసులు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని పెద్దమ్మ గుడిలో పెద్దమ్మతల్లి యొక్క పుస్తె మట్టెలు దొంగతనం జరిగాయి. నేరం రుజువు అవడంతో జైలుశిక్షతోపాటు 200రూపాయలు జరిమానా విధించారని ముస్తాబాద్ ఎస్సై చిందం గణేష్ తెలిపారు.
