అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ డా.బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి. సామాజిక న్యాయ ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారత రత్న డా.బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చేబర్తి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి మర్కుక్ మండల బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మర్కుక్ మండల బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ సామాజిక హక్కుల ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ప్రజలకు డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ఎనలేని సేవ చేశారని, ఆయన ఆశయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, యాదగిరి, కనకయ్య, చిన్నికృష్ణ, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.
