వేములవాడ – జ్యోతి న్యూస్
వేములవాడ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బద్ధుల బాబురావు ఆదేశాల మేరకు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏ. టి. యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఏ. టి. యాదవ్ మాట్లాడుతూ… జిల్లాలోని యాదవ కులస్తుల సంక్షేమం కొరకు, యాదవ హక్కులకై పోరాడుతానని, యాదవ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కుల సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బండ నర్సయ్య యాదవ్, బోయినిపల్లి మండల సెస్ డైరెక్టర్ మెదుడుల మల్లేశంయాదవ్, మిర్యాల భాస్కర్ యాదవ్, బర్కని నవీన్ యాదవ్, వాసం మల్లేశం యాదవ్, జడ రవీందర్ యాదవ్, ఏశ పర్శరాములు యాదవ్, జిల్లాలోని యాదవ కుల సభ్యులు పాల్గొన్నారు.