Breaking News

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి*

138 Views

*ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి*

అదిలాబాద్ జిల్లా:జులై

ప్యాసింజర్‌లతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్టు తెలిసింది, ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మేకలగండి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులను ఆటో డ్రైవర్ పొచ్చన్న, అతని భార్య గంగు, కూతురు శైలజ, ఆమె చిన్నమ్మ సోంబాయిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *