మలిదశ ఉద్యమ పోరాట ఫలితమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తెలిపారు గురువారం రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ రాచర్ల బొప్పాపూర్ కార్యాలయంలో అధ్యక్షులు కొండ రమేష్ గౌడ్ గారిచే పతాకావిష్కరణ జరుపబడింది ఇట్టి కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్ రెడ్డి ఎం పి టి సి ఇల్లందుల గీతాంజలి శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ సుమలత బాపురెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు మాలోతు బాలునాయక్, సిరిపురం రాజిరెడ్డి, డోనుకుల రామచంద్రం, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతన్నలు, కమిటీ సిబ్బంది పాల్గొన్నారు




