Breaking News

కాళేశ్వరం జోన్ కు మంచి పేరు తీసుకురావాలి: పోలీస్ కమీషనర్

7 Views

రామగుండం పోలీస్ కమీషనరేట్

రాష్ట్ర, జాతీయ స్థాయి లో రామగుండం కమిషనరేట్ కు, కాళేశ్వరం జోన్ కు మంచి పేరు తీసుకురావాలి: పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,

రామగుండము కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ రెండవ రోజు పలు అంశాలపై అధికారులు, సిబ్బందికి డ్యూటీ మీట్‌ పోటీలను నిర్వహించడం జరిగింది. ఆర్మూడ్ రిజర్వ్ విభాగాలైన డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టిమ్ పనితీరును ఈ రామగుండము పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా  ప్రత్యేకంగా పరిశీలించారు. మొదటగా సీపీ  పోలీసు జాగిలాల నుండి  వందనం అందుకున్న తరువాత జాగిలాలు నేర స్థలంలో బాంబులను, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను ఏవిధంగా గుర్తిస్తాయని, డాగ్ హ్యండ్లర్ ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. బాంబు డిస్పోజల్ ముఖ్య మైన ప్రదేశాలను ఏ విధంగా సర్చ్ చేయడం జరుగుతుందని, డీప్ సర్చ్ మెటల్ డిటెక్టర్ ద్వారా భూమి లోపల పాతిపెట్టిన మందుగుండు సామాగ్రిని, అనుమానస్పదమైన, ప్రమాదకరమైన ఇనుప వస్తువులను ఏ విధంగా నివృత్తి చేయడం జరుగుతుందని బీడీ టీమ్ సిబ్బంది చేసి చూపించడం జరిగింది.

సీపీ  మాట్లాడుతూ… పోలీసు అధికారులు, సిబ్బందిలో సామర్ధ్యం, ప్రతిభను వెలికితీసేందుకు పోలీసు డ్యూటి మీట్ ఎంతగానో ఉపయోగ పడుతుంది అన్నారు. విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం చాలా కీలకం అని తెలిపారు. కాళేశ్వరం జోన్ స్థాయి డ్యూటీ మీట్ లో 91 మంది అధికారులు, సిబ్బంది కంప్యూటర్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫింగర్‌ ప్రింట్స్‌, హ్యాండ్లింగ్‌, ప్యాకింగ్‌ లిఫ్టింగ్‌, బాంబ్‌ డిస్పోజల్‌, డాగ్‌ స్క్వాడ్‌, ఫోటో మరియు వీడియో గ్రఫీ విభాగాల్లో పాల్గొని వారు కనబరిచిన తమ ప్రతిభ, సామర్ధ్యం ఆధారంగా రాష్ట్ర స్థాయిలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో నిర్వహింబడే తెలంగాణ రాష్ట్ర రెండవ పోలీస్ డ్యూటీ మీట్ ఎంపిక చేయడం జరుగుతుంది. పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొనే వారందరూ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించాలని ఇక్కడ ఎంపికై కాలేశ్వరం జోన్ తరపున మరియు రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించి రామగుండం కమిషనరేట్ కు, కాళేశ్వరం జోన్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, గోదావరిఖని ఏసీపీ ఎమ్ రమేష్, ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏ ఓ శ్రీనివాస్, సి సి ఎస్ ఇన్స్పెక్టర్ బాబురావు, ఆర్ ఐ లు దామోదర్ వామనమూర్తి శ్రీనివాస్ మల్లేశం, ఎస్ఐ లు, ఆర్ ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్