Breaking News

డిఎంజేయూ ఆవిర్భావం – తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడుగా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు అశోక్

138 Views

డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక డిఎంజెయూ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంపెల్లి ముత్తేష్ ఆధ్వర్యంలో జరిగింది. శుక్రవారం హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగిన డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ సమావేశం స్థానిక ఎం.ఎస్ రెడ్డి కాంప్లెక్స్ లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఎన్నిక నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్ కు చెందిన కె.రాజేంద్రప్రసాద్ ఎన్నిక కాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన బొడ్డు అశోక్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు హన్మకొండ జిల్లాకు చెందిన కె.వెంకటాచారి, రంగారెడ్డి జిల్లాకు చెందిన యుగంధర్, సహయ కార్యదర్శులుగా భూపాలపల్లి జిల్లాకు చెందిన గుండాల సునీల్ చంద్ర, పెద్దపెల్లి జిల్లాకు చెందిన రాజగోపాల్ ఎన్నికయ్యారు. అలాగే సభ్యులుగా హనుమకొండ జిల్లాకు చెందిన యార సాంబయ్య, సారంగపాణి, వరంగల్ జిల్లాకు చెందిన కన్నయ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ జాతీయ నాయకులు చంద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7