హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 4న బండి సంజయ్ స్థానంలో ఆయన్ను నియమించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా భాజపా కీలక మార్పు చేపట్టింది. కిషన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే పదాధికారుల సమావేశంలో పాల్గొంటారు. విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకునే కిషన్‌రెడ్డి బాటసింగారంలో రెండు పడక గదుల ఇళ్లను పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భాజపా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు.
