*మంచిర్యాల నియోజకవర్గం*
కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించడం ,పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయలు చెల్లించడం గురించి.
జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి .చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తున్నది .వెంటనే గ్రామాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందాలను నియమించి యుద్ద ప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలని .గ్రామాల వారీగా వచ్చిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపి ఎకరాకు 25 వేల రూపాయల నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు చేపట్టాలని.వరి తో పాటు వివిధ పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో హామీ ఇచ్చింది .ఖరీఫ్ నుంచే ఈ బోనస్ చెల్లింపు ను అమలు చేస్తామని చేయలేదు .యాసంగి పంటలకు బోనస్ చెల్లించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని .మా రెండు డిమాండ్లయిన పంట నష్టం వివరాల సేకరణ ,బోనస్ చెల్లింపు డిసెంబర్ 6 తారీకు లోపు అమలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చిన మంచిర్యాల *మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
