ప్రాంతీయం

బీసీ విద్యార్థి సంఘంలో భారీగా విద్యార్థులు చేరిక ఆహ్వానించిన బీసీ విద్యార్థి సంగం రాష్ట్ర కోఆర్డినేటర్…

141 Views

ముస్తాబాద్, ప్రతినిధి జూలై20, సిరిసిల్లలొ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీగా చేరిన విద్యార్థులు సాధారంగ ఆహ్వానించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చేరడం చాలా సంతోషమని వారు ప్రభుత్వ విద్యా వ్యతిరేకులపై ఎప్పటికప్పుడు పోరాటం చేయాలని నూతనంగా చేరిన విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులకు రావలసిన పెండింగ్ స్కాలర్షిప్ లు ఫీజు రియబాస్మెంటును వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే హాస్టల్లల్లో సన్న బియ్యంతో ఆహారం పెట్టాలని నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. లేనియెడల రానున్న రోజుల్లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడు రుద్రవీణ సుజిత్, నవీన్, విద్యార్థులు చిట్టెబోయిన రాజశేఖర్.యాదగిరి, అభిషేక్,బత్తిని వినయ్,మెట్టె రామ్ సాయి, విమల, రామ్ చరణ్, నాగుల నవీన్,మల్లేష్, రామినేని అరవిందు, రాము,రాజు, చంద్రశేఖర్,పవన్, అరవింద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *