ట్యాబ్ అందించిన చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం. ,ఎల్లారెడ్దిపేట న్యూస్
. ఎల్లారెడ్దిపేట మండల కేంద్రానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత -బాలరాజు యాదవ్ ల కూతురు ఒగ్గు శ్రీనిధి యాదవ్ ఇటీవల వెలువడిన ఇంటర్ మొదటి సంవత్సరం బై పి సి లో 435/440 మార్కులతో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోత్సాహకంగా ఇచ్చిన ట్యాబ్ ను ఆదివారం ఎల్లారెడ్దిపేట లో గల శ్రీనిధి యాదవ్ ఇంటికి వెళ్లి చొప్పడండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం శ్రీనిధి యాదవ్ కు అందజేశారు. ట్యాబ్ ను సద్వినియోగం చేసుకుని నీట్ లో మంచి ర్యాంక్ సాధించి భవిష్యత్ లో మంచి డాక్టర్ గా పేరు పొందాలని ఆయన ఆశీర్వదించారు.చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం వెంట లయన్స్ క్లబ్ మెంబర్ నాయిని భాస్కర్ రెడ్ది ఉన్నారు.తమ కూతురు కు ట్యాబ్ ప్రోత్సాహకంగా ఇచ్చిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు, ట్యాబ్ అందించిన చొప్పడండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం కు శ్రీనిధి యాదవ్ తో పాటు ఆమె తల్లిదండ్రులు ఒగ్గు రజిత యాదవ్ – ఒగ్గు బాలరాజు యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.
