* కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ
* జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య
* చందుర్తి జడ్పిటిసి నాగం కుమార్
చందుర్తి – జ్యోతి న్యూస్
మేడిపల్లి మండలం మోత్కురావుపేట గ్రామంలో బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ జెడ్పీ చైర్ పర్సన్, బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీమతి తుల ఉమ రాజేందర్. సందర్భంగా శ్రీమతి తుల ఉమ మాట్లాడుతూ… గ్రామ కుల బంధువులందరికీ బీరప్ప ఆశీస్సులు ఉండాలని, వేములవాడ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటూ, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. అనంతరం తుల ఉమ రాజేందర్ ని, వివిధ హోదాలలో ఉన్న కుల బాంధావులందరిని గ్రామ కురుమ సభ్యులు బుధవారం సన్మానించడం జరిగింది. తన స్వగ్రామమైన మోత్కురావుపేటలో వీధి వీధినా కలియతిరుగుతూ అందరినీ పలకరిస్తూ, వారి నివాసంలో బంధువులతో కాసేపు ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో తుల ఉమ తో పాటు గ్రామ సర్పంచ్ దుంపేట నర్సయ్య, ఉప సర్పంచ్ గంగారాం, వార్డు సభ్యులు, రాజన్న సిరిసిల్ల జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు ఏనుగుల కనుకయ్య, చందుర్తి మండల జెడ్పీటీసీ నాగం కుమార్, జోగాపూర్ ఎంపిటిసి మ్యాకల గణేష్, వేములవాడ రూరల్ ఎంపిపి జక్కుల తిరుపతి, వేములవాడ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు గుంటి కనుకయ్య, ఉపాధ్యక్షులు ఏనుగుల కృష్ణ, కార్యదర్శి ఓల్లెం నాగరాజు, ముద్దాల రాము, ఏనుగుల తిరుపతి, ఏనుగుల శ్రీను, ఏనుగుల రమేష్, ఏనుగుల అనిల్, బొడపట్ల పర్శురాములు, చిమళ్ళ మల్లేశం,మ్యాకల కొమురయ్య, సురేష్ రావు, BJYM మండల అధ్యక్షులు మధు, శేఖర్, శ్రీనివాస్, సత్యపాల్, జలంధర్ తదితరులు ఉన్నారు.