ప్రాంతీయం

ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభా కనబరిస్తున్న శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన బట్టు అంజిరెడ్డి..

120 Views

గజ్వేల్ మండలం సంగుపల్లి గ్రామానికి చెందిన బసాడి శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి. వారు మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి విజనై ఫోటోగ్రఫీ సంస్థ ద్వారా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి ఢిల్లీలో నిర్వహించబడినటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డు ను పొందినందుకు చాలా సంతోష కారం అని, తెలంగాణ రాష్ట్రం గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపికై, కరోనా టైంలో ఎంతోమందికి ప్రాణదానం చేసిన గొప్ప మానవత్వం చాటుకున్న సోను సూద్ లాంటి మహానటుడి చేతుల మీదుగా అవార్డు పొందడం గజ్వేల్ నియోజకవర్గానికి గర్వకారణం అని అన్నారు. గజ్వేల్ ముద్దుబిడ్డైనా బాసడి శ్రీకాంత్ రెడ్డి భవిష్యత్తులో ఇంకా అత్యుత్తమ స్థానంలో వెళ్లి తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్లాలని దీనికి సంబంధించి ఎల్లవేళలా వారి యొక్క సహాయ సహకారం ప్రోత్సాహం ఉంటుందని ఇలాంటి యువతి యువకులను ప్రోత్సహించి వారి జీవితం బంగార మయం చేయడమే వారి ముఖ్య ఉద్దేశంగా తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *