ప్రాంతీయం

శ్రీరాంపూర్ లో రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన సదస్సు

68 Views

మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్.

అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి – శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్.

దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది.

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా పోలీస్ స్టేషన్ సర్కిల్లో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత నియమాలు గురించి అవగాహన సదస్సు వాహనదారులకు తెలియజేశారు.

శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఏరియా సిఐ వేణు చందర్ మాట్లాడుతూ వాహనదారులు అందరూ తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులు వాహనాలు నడపరాదు.  వాహనదారులు అందరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి మరియు హెల్మెట్  ధరించి వాహనం నడపాలి ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ అందరూ వాహనాలు నడపాలని వాహనదారులకు సూచన చేశారు. దేశ భవిష్యత్తు మొత్తం యువత చేతిలో ఉందని, తొందరపడి అతివేగంతో వాహనాలు నడప రాదని యువతను కోరారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్