*నాన్ బేలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి.*
*ఫోక్సో మరియు ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి*
.కమ్యూనిటీ పోలీసులు భాగంగా ప్రజలకు సైబర్ నేరాలు మరియు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలి.*
*2021, 2022 సంవత్సరం లో(అండర్ ఇన్వెస్టిగేషన్) పెండింగ్ ఉన్న కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు.*
*పెండింగ్ కేసులపై, ఫంక్షనల్ వర్టికల్ పై సమీక్ష సమావేశం*
పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీయస్,. మేడమ్ గారు*
*ఈరోజు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్. మేడమ్ గారు, గజ్వేల్ డివిజన్, సిద్దిపేట వన్ టౌన్, టూ టౌన్, 3 టౌన్, పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి ఎసిపి, సిఐలను, ఎస్ఐలను అడిగి తెలుసుకొని, (యస్ ఓ పి) ప్రకారం సిడి ఫైళ్ళల్లో ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉందో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ*.
1. నాన్ బేలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి.
2. ఫోక్సో మరియు ఎస్సీ ఎస్టీ కేసులలో 60 రోజులలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి.
3. కమ్యూనిటీ పోలీసులు భాగంగా ప్రజలకు సైబర్ నేరాలు మరియు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలి.
4. 2021, 2022 సంవత్సరం లో పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలని సూచించారు.
5. మిస్సింగ్ కేసులు, 174 కేసులు, అన్నౌన్ డెడ్ బాడీ లు కేసులు యొక్క వివరాలు వెంటనే సిసి టిఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలి,
6. మిస్సింగ్ కేసులను అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ట్రేస్ అవుట్ చేయాలని సూచించారు.
7. పెండింగ్ నాన్ బేలబుల్ వారెంట్స్ పై రివ్యూ నిర్వహించి వారి యొక్క అడ్రస్ కనుక్కొని ఎగ్జిక్యూటివ్ చేయాలని అధికారులకు సూచించారు.
8. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి,
9. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్ ల యొక్క కదలికలపై నిరంతరం నిఘాపెట్టాలి.
10. కేసుల్లో శిక్షల శాతం పెంచాలి.
11. నూతన టెక్నాలజీని అధికారులు సిబ్బంది అందిపుచ్చుకోవాలి,
12. దొంగతనాల కేసుల్లో ప్రతిరోజు కేసు చేతన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని సూచించారు.
13. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు మరియు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు.
14. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.
15. సీసీ కెమెరాలను ప్రతిరోజూ మానిటర్ చేయాలని పని చెయ్యని సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయించాలని సూచించారు. మరియు
16. విధినిర్వహణలో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు.
17. పెండింగ్ ఉన్న సీసీ నెంబర్లు వారం రోజులలో తీసుకోవాలని సూచించారు.
18. సైబర్ నేరాల నియంత్రణ గురించి, గంజాయి, డ్రగ్స్ సమూలంగా నిర్మూలించడానికి గ్రామాలలో పట్టణాలలో మరియు ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, సిద్దిపేట ఏసిపి దేవారెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్, ట్రాఫిక్ ఏసిపి ఫణేందర్, సిసిఆర్బి ఏసిపి చంద్రశేఖర్, ఎస్బి ఏసిపి రవీందర్ రాజు, వన్టౌన్ సిఐ బిక్షపతి, టూటౌన్ సిఐ రవికుమార్, త్రీ టౌన్ సిఐ భాను ప్రకాష్, గజ్వేల్ సిఐ వీరప్రసాద్, గజ్వేల్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, సిసిఆర్బి సిఐ గురుస్వామి, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, గజ్వేల్, సిద్దిపేట డివిజన్ ఎస్ఐలు, ఐటీకోర్ టీం సిబ్బంది, సిసిఅర్బి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
