మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా సోమవారం టిఫిటిఎఫ్ గజ్వెల్ జోన్ కార్యాలయంలో మహిళా సదస్సుకు సంబందించిన కరపత్రం ఆవిష్కరించారు.ఈసందర్బంగా నిర్వహణ కమిటి సభ్యులు మంజుల, జ్యోతి, యాద లక్ష్మి, జ్యోత్స్న లుమాట్లాడుతూ మార్చి 8 నాడు మధ్యాహ్నం 02:30 గంటల నుండి 05:00 గంటల వరకు గజ్వెల్ జోన్ కార్యాలయంలో మహిళా సాధికారిత అనే అంశం పై మహిళా సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఇట్టి మహిళా సదస్సుకు ప్రధాన.వక్తగా ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, ముఖ్య అతిథులు గజ్వేల్ ఎంపీపీ దాసరి అమరావతి, ఎంఈఓ సునీత హాజరు అవుతున్నారని మహిళా ఉపాధ్యాయులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజులు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్, జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ కో కన్వీనర్ విద్యా సాగర్, గజ్వెల్ ,వర్గల్ మండలాల అధ్యక్షులు పాపిరెడ్డి,పర్వతం నర్సయ్య, గజ్వెల్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు, ములుగు మండల భాద్యులు కట్టుకం రాజయ్య, సీనియర్ నాయకులు, రాంచంద్రం, ఎల్లయ్య తది తరులు పాల్గొన్నారు.




