Breaking News

ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి – దుబ్బాక జూనియర్ సివిల్ జడ్జి చందన

102 Views

ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలి

– దుబ్బాక జూనియర్ సివిల్ జడ్జి చందన

—–

దుబ్బాక : విద్యా సంస్థల్లో కొత్తగా చేరే విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్ధులు చేసే ర్యాగింగ్ మూలంగా ఎంతో మంది విద్యార్థులు విద్యకు దూరం అవడంతో పాటు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని దుబ్బాక జూనియర్ సివిల్ జడ్జి చందన అన్నారు. దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో

*ర్యాగింగ్ ముప్పు* అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు ర్యాగింగ్ మూలంగా ఏర్పడే దుష్పరిణామాలు అమాయక విద్యార్థుల ప్రాణాలు పోవడం, ఉన్నత చదువులకు దూరం అవడం వంటి సందర్భాలను విద్యార్థులకు వివరించారు. 1996లో ఏర్పాటుచేసిన ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం ర్యాగింగ్ కు పాల్పడే వారి పట్ల కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయని అన్నారు. ఈ చట్టాల పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు విద్యార్థులు విద్యాలయాల్లో సీనియర్ విద్యార్థుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు, వారు చేసే వెకిలి చేష్టల ద్వారా పడే ఇబ్బందులను ఎలా నిరోధించాలో ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చదువుకునే వయసులో రకరకాల ఆలోచనలతో మనస్సు విద్యపై దృష్టి పెట్టకుండా ఇతర అంశాలపైకి మరలుతుందన్నారు. విద్యార్థులు మానసికంగా ధైర్యాన్ని కూడగట్టుకొని తమకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకోగలిగే ఆలోచన చేయాలన్నారు. అంతేకాకుండా ప్రతి కళాశాలలో, యూనివర్సిటీలో ర్యాగింగ్ నిరోధించేందుకు, ర్యాగింగ్ కు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన చట్టాలు కూడా ఉన్నాయన్నారు.

కనుక కళాశాలలోనూ విశ్వ విద్యాలయాలలోను ర్యాగింగ్ నిషేధం అనే బోర్డులను, ర్యాగింగ్ ముప్పు గురించి తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా ర్యాగింగ్ జరిగినట్లు భావిస్తే 1800 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయవచ్చు నన్నారు.

ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తిరుపతి, అడ్వకేట్లు అశోక్, భాస్కర్ రెడ్డి, నాగరాజు, దుబ్బాక ఎస్సై బి. మహేందర్ కళాశాల పంచాయతీ ప్రిన్సిపాల్, లెక్చరర్లు శివకుమార్, తిరుపతిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో లెక్చరర్లు రవీందర్ రెడ్డి, ఎం రాజు, శైలజ, వీరయ్య కే రాజు, సంతోష, స్వప్న, రఘునందన్ శ్రీనాథ్, సాంబశివరావు, స్వామి, రవి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *