కుకునూరు పల్లి మండలం మేదినిపూర్ గ్రామంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాక్యలను వక్రీకరించి భారసా నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది మొదట కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాంగ్రెస్ పార్టీ విధానం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదినిపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మామిడి గోపి యూత్ అధ్యక్షుడు బోయిన రఘు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
