రాజన్న సిరిసిల్ల :
సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రాణిరుద్రమ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిరిసిల్లలో ప్రచారాన్ని ప్రారంభించారు. సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు.
బీజేపీ పార్టీలో మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పిస్తుందని సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని, బిజెపి మాత్రమే బీసీలకు ఇచ్చిన గౌరవమని ఆమె చెప్పారు. అంతేకాకుండా మహిళలకు ఏ పార్టీ ఇవ్వని ప్రాధాన్యత బిజెపి ఇసచ్చిందన్నారు. కేంద్ర మంత్రులుగా, రాష్ట్రపతిగా అవకాశం కల్పించిందని.. తనకి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడం గొప్ప విషయమన్నారు. సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తుందని, ఈ సిరిసిల్లలో దొరల గడీల పాలనను బద్దలుకొడతామన్నారు. సిరిసిల్లలో ఉన్న ప్రతి కార్యకర్త ఒక శక్తితో సమానమని, తాను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటే ఒక కార్యకర్తగా భావిస్తానన్నారు. బిజెపి తాను చేరిన తర్వాత సిరిసిల్ల బాధ్యతలు పార్టీ అధిష్టానం నాకు అప్పగించిందని, సెస్ ఎన్నికల్లో పాలక్ గా నియమించిందన్నారు. సెస్ ఎన్నికల్లో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడి గెలించిందన్నారు. సిరిసిల్ల షాడో ముఖ్యమంత్రి కెటిఆర్ పాలనను గద్దె దింపే రోజులు వచ్చాయన్నారు. ఇక్కడి బిజెపి కార్యకర్తలను అధికార పార్టీ ఎన్ని కష్టాలు పెట్టిన నిలబడి పార్టీ కోసం పనిచేసే నిలబడ్డారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల జిల్లా ఇంచార్జీ, కర్ణాటక ఎమ్మెల్యే విఠల్ సోమన్న,
జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ఆడెపు రవిందర్, కుమ్మరి శంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు




