ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 11, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన గొట్టే అభిలాష్ అనే యువకుడు రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు గ్రామంలోని మిత్రుడి వివాహానికి హాజరై తన ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ వెళుతుండగా సిరిసిల్ల సమీపంలోని పెద్దూరు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు.వెంటనే108 వాహానంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అదే ద్విచక్ర వాహనంపై వున్న అభిలాష్ మిత్రుడు సుమిత్ స్వల్పంగా గాయ పడగా ఆసుపత్రిలో చికిశ్చ పొందుతున్నట్లు సమాచారం. ప్రమాదంపై ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గొట్టే అభిలాష్ డిగ్రీ విద్యార్థి అని తెలిపారు.ఆయన మృతి తో వెంకట పూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకుంది.




