కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత కరెంట్ మరియు 24 గంటల కరెంట్ ఇవ్వడం దండగ అని రైతులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గజ్వేల్ మండల బి. అర్.యస్ పార్టీ అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాటికొండ మధుసూదన్ రెడ్డి తో కలిసి సింగాటం గ్రామము లో నిరసన మరియు దిష్టిబొమ్మను దగ్దం చేయటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి వ్యవసాయం దండగ అన్న నాయకులకు బుద్ధి చెప్పి వ్యవసాయం పండుగ అనే రీతిలో కేసీఆర్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేం అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తా అనడం విడ్డూరమని అన్నారు.తెలంగాణ ప్రజలు రైతులు రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో ఎక్కడ తీరగనియరన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు తోకల బుచ్చిరెడ్డి వార్డు సభ్యులు.T. రామచంద్ర రెడ్డి, J సంతోష్ రెడ్డి, D స్వామి, K నరేష్ గౌడ్ G. దయాకర్ రెడ్డి, పార్టీ నాయకులు Y. శ్రీనివాస్ రెడ్డి p. ప్రభాకర్ p. రాజమల్లు. రామ్ రెడ్డి, కిష్టారెడ్డి, ప్రహల్లాద గౌడ్, శ్రీకాంత్, సాగర్ గౌడ్, N కిషన్ కరుణాకర్, గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు.
