ప్రాంతీయం

ముమ్మరంగా కొనసాగిన సామాజిక తనిఖీ

99 Views

తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 21

 

తొర్రూరు మండలంలోని 29 గ్రామపంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2022-23 సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి పనులపై స్పాట్ వారి ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా తొరూరు మండలం అమ్మాపురం గ్రామంలో జరిగినటువంటి ఉపాధి హామీ పనుల లో భాగంగా కూలీలకు గాను 919216 రూపాయలు, మెటీరియల్ ఖర్చులకు గాను 3,20,573 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని వీటికి సంబంధించిన కొలతల పుస్తకాలు మరియు మస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని అమ్మాపురం బిఆర్పి వేల్పుల యాకయ్య అన్నారు. అమ్మాపురం గ్రామంలోని శ్రీరాములకుంటలో జరిగిన రేగడి పూడిక తీత పనులకు సంబంధించిన కొలతలను పంచాయతీ కార్యదర్శి శ్రావణి సమక్షంలో బిఆర్పి యాకయ్య పని ప్రదేశాన్ని భౌతికంగా పరిశీలించిన అనంతరం కొలతలు తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో వి ఎస్ ఏ కుర్ర సాత్విక్, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ యాకయ్య గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Oplus_131072
Oplus_131072
గాదె కృష్ణ పాలకుర్తి కాన్స్టెన్సీ ఇంచార్జ్