ముస్తాబాద్, ప్రతినిధి జూలై 8, ముక్తినాథ్ కేవలం హిందువులకే కాదు, ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ ఆలయం రాణి పౌవా గ్రామానికి సమీపంలో ఉంది. హిందువులు ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉండేదనీ, ఆ తరువాత బౌద్ధులు ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ అత్యధికంగా లభించడమే ఇందుకు కారణం. 51 శక్తిపీఠాలలో ఇది ఒకటి బౌద్ధులు ఈ ప్రదేశాన్ని చుమింగ్ గ్యాస్థా అని పిలుస్తారట టిబెటిన్ బౌద్ధులు ముక్తినాథ్ లేక చుమింగ్ గ్యాస్థాను ఢాఖినీ క్షేత్రంగా భావిస్తారు. ఢాకినీ అంటే ఆకాశనృత్య దేవత. బౌద్ధుల వజ్రయాన బుద్ధిజానికి చెందిన తాంత్రిక ప్రదేశాలలో ముక్తినాథ్ ఒకటి. అవలోకేశ్వరుడు ముక్తినాథుడిగా అవతరించాడని వారు భావిస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ముస్తాబాద్ మండలం మోనికుంట గ్రామంనుండి సర్పంచ్ కల్వకుంట్ల వినయ గోపాల్ రావుతో పాటు ఆసక్తిగల గ్రామస్తులు దర్శనం చేసుకున్నారు.
