దౌల్తాబాద్: నేలను సంరక్షించి భూసారాన్ని పెంచుకోవాలని మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు అన్నారు. సోమవారం మండల పరిధిలోని దొమ్మాట రైతు వేదికలో ప్రపంచ నేల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తథానుగుణంగా ఎరువులు వాడాలని సూచించారు. నేల ప్రాముఖ్యత, నేల ఆరోగ్యం, నేలను సంరక్షించే పద్ధతులు, అంతర పంటలు, పచ్చిరొట్ట ఎరువులు ఆవశ్యకత, పంటల మార్పిడి వల్ల నేల ఆరోగ్యం పెంచే విధానంపై రైతులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దొమ్మాట, ముత్యంపేట సర్పంచులు పూజిత వెంకటరెడ్డి, బండి రాజు, మండల కో ఆప్షన్ అహ్మద్, ఏఈఓ సంతోష్ కుమార్, గ్రామ రైతు సమితి కోఆర్డినేటర్లు నర్ర రాజేందర్, చంద్రారెడ్డి, లింగం, రైతులు పాల్గొన్నారు.




