ముస్తాబాద్, ప్రతినిధి జూలై 8, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో1987 సంవత్సరం వరకు కలిసి చదువుకున్న తోటి మిత్రుడు మల్కాపేటకు శాదుపల్లి శ్రీనివాస్ గౌడ్ గత 22రోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ మరణాన్ని జీర్ణించుకోలేని ఆయన తండ్రి లక్మి నారాయణ గత 11 రోజుల క్రితం మరణించాడు. ఇంటికి పెద్దదిక్కులు ఇద్దరు మృతి చెందగా కుటుంబం రోడ్డునపడ్డది. శ్రీనివాస్ కు అంగవైకల్యం కలిగిన కుమారుడు అరవింద్, డిగ్రీ చదువుతున్న అర్చన కూతురు కలరు. సమాచారం అందుకున్న 1986-87 కు చెందిన పూర్వ విద్యార్థులు వాట్సాప్ ద్వారా సమాచారం చేరవేసుకొని వారికి తోచినంత సహాయాన్ని అందించారు. అట్టి 62వెల నగదును భార్య పద్మకు అందించారు. రానున్న రోజుల్లో మిత్రులం అండగా నిలుస్తామని వెల్లడించారు. తోటి స్నేహితులు ఆర్థిక సహాయాన్ని అందించి అందగానిలుస్తామనడంతో కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ కార్యక్రమంలో కుక్కల దేవేందర్, పార్వతి హరికృష్ణ, అక్క పెళ్లి యాదగిరి గౌడ్, ఎనుగందుల శంకర్, బొంపల్లి శ్రీనివాస్, మదికొండ నారాయణ తోటి మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
