ముస్తాబాద్, జూలై 19 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లా పరిషత్ బందనకల్ పాఠశాలలో ఇటీవల జరిగిన పదోన్నతుల్లో భాగంగా ఎస్.ఏ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)గా పదోన్నతి పొంది ముస్తాబాద్ జిల్లా పరిషత్ గర్ల్స్ ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లిన స్వగ్రామం పోతుగల్ కు చెందిన అంకం. రాజశేఖర్ ను ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో మాజీ విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, ప్రైమరీపాఠశాల ఉపాధ్యాయ శాక బృందాలు సత్కరించి ఘనంగా సన్మానించి వీడ్కోలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో మాజీ రెడ్డిసంఘం అధ్యక్షులు చల్లదేవరెడ్డి ప్రధానోపాధ్యాయులు బి. రాజకుమార్, చారి, రవీందర్ రెడ్డి, బాలకిషన్, శ్రీనివాస్ రాములు, సత్యనారాయణ, అనిత, స్వరూప, శారద ఉమారాణి గ్రామస్తులు ఉన్నారు.
