దౌల్తాబాద్: అనుమానాస్పద దాడి కేసులో నిందితున్ని శుక్రవారం దౌల్తాబాద్ పోలీసులు రిమాండ్ చేశారు. ఎస్ఐ చైతన్య కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. డిసెంబర్ 9న దౌల్తాబాద్ మండలం మొండి చింత వద్ద ఉన్న ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల సమీపంలో రాయపోల్ మండలం తిమ్మకపల్లి గ్రామానికి చెందిన ఇప్ప ప్రశాంత్ కుమార్ మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలో నర్సంపేట గ్రామానికి చెందిన మనెగళ్ళ ప్రభాకర్ తన పొలం వద్దకు వెళ్లి వస్తుండగా ఇప్ప ప్రశాంత్ కుమార్‌ను గమనించి పారతో కొట్టాడు. ప్రశాంత్ కుమార్‌కు గాయం కావడంతో పసుపును పెట్టాడు. తర్వాత ద్విచక్ర వాహనం తాళం చెవి, పర్సు, రూ. 570 తీసుకు వెళ్ళాడు. శుక్రవారం పోలీసులు హైమద్‌నగర్ గ్రామంలో వాహనాల తనిఖీ చేస్తుండగా ప్రభాకర్‌ను పట్టుకొని అదుపులోనికి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకొనగా రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ చైతన్య కుమార్‌రెడ్డి తెలిపారు. ఏఎస్సై సాయిలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




