ప్రాంతీయం

పిల్లలను బడిలో చేర్పిద్దాం

139 Views

బడీడు పిల్లలను బడిలో చేర్పిద్దాం.

డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

సిద్దిపేట జిల్లా జూన్ 12

సిద్దిపేట జిల్లా గజ్వేల్ డీడు పిల్లలను బడిలో చేర్పించాలని ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం లో బాగంగా బుధవారం నాడు గజ్వేల్ ప్రభుత్వ బాలుర హైస్కూల్ లో బడిబట కార్యక్రమం లో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఏగొండ స్వామి మాట్లాడుతూ వేసవి సెలవులకు టాటా చెప్పుతూ పాఠశాల కడపతొక్కుతున్న విద్యార్థలకు సమస్యలు ఎదురవ్వొద్దని ప్రభుత్వాన్ని కొరారు.జిల్లాలో 638 ప్రాథమిక,113 ప్రాథమికోన్నత,227 ఉన్నత పాఠశాలలో 85,291 మంది విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నరన్నారు.విద్యార్థులందరికి ఎకరూప దుస్తువులు,పాఠ్య,రాత పుస్తకాలు సకాలంలో ఇచ్చి మద్యాహ్న బోజనం పకడ్బందీగా అమలు చేయలన్నారు.

గత ప్రభుత్వ మా ఊరు_మా బడి ప్రస్తుత ప్రభుత్వ అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కి 1018 పాఠశాలకు గాను 814 పాఠశాలలను గుర్తించి వీటి అభివృద్ధి కొసం 3480 కోట్లు కేటాయించినప్పటికి 8.40 కోట్లు మాత్రమే విడుదల చేసి కేవలం 375 పాఠశాలలు మాత్రమే కనీస సౌకర్యాలు తీర్చగలిగారన్నారు.మిగిత పాఠశాలల అభివృద్ధి ని మరిచిపొకుండా పాఠశాలలో త్వరితగతిన అమ్మ ఆదర్శ కమిటిల ద్వారా పరిష్కరించి విద్యార్థులు పాఠశాలకు వచ్చెవిధంగా చేయాలని ప్రభుత్వాన్ని కొరారు.

ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాద్యాయులు, డిబిఎఫ్ జిల్లా ప్రదాన కార్యదర్శి బ్యాగరి వేణు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found