మిరుదొడ్డి మండలం అందె గ్రామానికి చెందిన ప్రజా ఉద్యమకారుడు కళాకారుడు అందె భాస్కర్ తండ్రి కామ్రేడ్ అందె బాలయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని ఆదివారం ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ వారి స్వగ్రామం అందెలో కుటుంబాన్ని పరామర్శించి మనొదైర్యం కల్పించారు. కామ్రేడ్ బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సుల్తాన మాట్లాడుతూ కామ్రేడ్ బాలయ్య మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అన్నారు. బాలయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయపోలు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు, జర్నలిస్ట్ మన్నె గణేష్ తదితరులు పాల్గొన్నారు.
