వైభవంగా బురుజు మైసమ్మ బోనాలు.
ఏన్సాన్ పల్లి ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో హాజరైన రాష్ట్ర మంత్రి హరీష్ రావు
ఏన్సాన్ పల్లి బురుజు మైసమ్మ బోనాల పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో ఆదివారం మంత్రి హరీశ్ రావు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు మంత్రిని సత్కరించారు. అనంతరం గ్రామంలోని ఆరే ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.