ప్రాంతీయం

రాజీవ్ గాంధీ 32,వర్ధంతి ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు…

184 Views

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే21, మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని దివంగత నేత స్వర్గీయ రాజీవ్ గాంధీ 32.వర్ధంతి ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో ఆయన విధానాలు ఎంతో సహాయపడ్డాయని దేశంకోసం చేసిన త్యాగాలు మరవలేనివని జాతి నిర్మాణంలో యవతకు ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో ఓటుహక్కు కనిష్ట వయోపరిమితిని 21, సంవత్సరాల నుంచి 18, సంవత్సరాలకు తగ్గించిన ఘనత రాజీవ్‌ గాంధీకే దక్కుతుందని స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కృషి చేసిన మహిళా పక్షపాతి రాజీవ్ గాందీఅని దేశంలో సమాచార ఎలక్ట్రానిక్‌ విప్లవానికి రాజీవ్‌ ఆద్యుడని ప్రపంచంలో పేరుగాంచిన ఐటీ రంగ సంస్థలకు మన దేశస్థులు సీఈవోలుగా నేడు కొనసాగడానికి రాజీవ్ గాంధీ దేశంలో వేసిన ఐటీ పునాదులే దోహదపడ్డాయని పంచవర్ష ప్రణాళికల ద్వారా పేదరిక నిర్మూలన నిరక్షరాస్యత నిర్మూలన ఆహార ఉత్పత్తులు ఉపాధి కల్పనలకు ప్రాధాన్యత కల్పించారని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, చీకోడ్ గ్రామశాఖ కొప్పు రమేష్, నామాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గన్నెబాను, రెడ్డి సీనియర్ నాయకులు వేల్ముల రాంరెడ్డి, వేముల సత్యంగౌడ్, దీటి నర్సింలు, వుచ్చిడి బాల్ రెడ్డి, ఆగుల్ల రాజేశం, మామిళ్ల ఆంజనేయులు, ఎస్ టి సెల్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ నాయక్, ఎన్ ఎస్ యుఐ మండల అధ్యక్షులు సారుగు రాకేష్, మిరుదొడ్డి భాను, ముక్క నరసయ్య, మచ్చ కొండయ్య, తలారి నర్సింలు, మద్దికుంట రాజo, మెర్గుశివ, బండిపెల్లీ నవీన్, కొత్తూరు నవీను, వంశీ, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *