మానకొండూరు నియోజకవర్గం లోని శంకరపట్నం మండలం అంబాలపూర్ గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబం తాళ్లపెళ్లి సంపత్ కొమరమ్మ కూతురు వరలక్ష్మి వివాహం ఆదివారం అంబాలపూర్ గ్రామంలో జరుగగా, ఆ వివాహానికి ముఖ్య అతిథిగా హాజరైన మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం నాగరాజు పెళ్లికూతురిని ఆశీర్వదించి,అ నిరుపేద కుటుంబానికి పుస్తె మట్టెలు అందజేశారు..
ఈ సందర్భంగా గడ్డం నాగరాజు మాట్లాడుతూ ఈ కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏ ఆపద వచ్చిన నా వంతు సహాయం చేస్తానని తెలిపారు. అనంతరం అ కుటుంబ సభ్యులు గడ్డం నాగరాజుకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకుడు పలకల రాజిరెడ్డి, మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్, ఎంపీటీసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొమురయ్య, మండల ప్రధాన కార్యదర్శులు సంపత్, నరేందర్, మండల కార్యదర్శి వడ్లకొండ రాజేందర్, యువ మోర్చా అధ్యక్షులు బోడిగే నరేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు బిజిలి సారయ్య, బూత్ అధ్యక్షులు వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.