సడక్ బంద్ తో ప్రభుత్వం దిగి రావాలి
– జేఏసీ నియోజకవర్గ నాయకుడు అందె అశోక్
సెప్టెంబర్ 24
సిద్దిపేట జిల్లా చేర్యాల : చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై ఈనెల 29న జరిగే సడక్ బంద్ తో ప్రభుత్వం దిగి రావాలని జేఏసీ నియోజకవర్గ నాయకుడు అందె అశోక్ అన్నారు. చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో ఆదివారం జరిగిన జేఏసీ నాయకుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ..
ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన చేర్యాల ప్రాంతం నేడు అస్తిత్వాన్ని కోల్పోయి వేలవేల పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశాస్త్రీయంగా ఇరు ప్రాంతాలకు విడదీసి ఈ ప్రాంతం ఎంతో నష్టపోయిన చేర్యాలకు పూర్వ వైభవం తీసుకురావడం కోసం అన్ని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందని, స్థానికేతరుడైన ముత్తిరెడ్డికి చేర్యాల ప్రాంత ప్రజలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన రెవెన్యూ డివిజన్ ఆకాంక్షను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రెవెన్యూ డివిజన్ ఉద్యమంలో భాగంగా ఈనెల 29న చేర్యాల, ముస్త్యాల, మర్రి ముచ్చాల సెంటర్ రహదారులపై మధ్యాహ్నం 12 నుండి 2గంటల వరకు సడక్ బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సడక్ బందుకు చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, ధూలిమిట్ట మండలాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమంలో జేఏసీ మండల కన్వీనర్ బొమ్మగోని అంజయ్య గౌడ్, ఎంపీటీసీ సుంకరి శ్రీధర్ గౌడ్, గ్రామ కన్వీనర్ వెలుగల రఘువీర్, శిగుల్ల బాల్ రాజు, ఉళ్లేంగల రాం బ్రహ్మం, శిగుళ్ల బీరయ్య, పందిళ్ల అంజయ్య, రేసు మల్లేష్, మహిపాల్ రెడ్డి, మల్లయ్య, కనకయ్య, యాదగిరి, సాయి, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
