ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 20, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో తన స్వగృహంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమానికి నియోజకవర్గ బాధ్యులు కేకే మహేందర్ రెడ్డి హాజరైనారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్య మంత్రి అని చెప్పుకునే నియోజకవర్గ మంత్రి నియోజకవర్గానికి గాని ముస్తాబాద్ మండలానికి గాని ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. ముస్తాబాద్ మండలానికి 30 పడగల ఆసుపత్రి గాని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గాని మినీ స్టేడియంగాని ఇలాంటివి ఎన్నికల సమయంలో ఎన్నో హామీల వర్షం కురిపించి ఓట్లు దండుకున్న కేటీఆర్ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన రాబోయే రోజుల్లో ఓట్లు కొరకువస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. 6నెలల కింద మండల కేంద్రంలోని యాదవ ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ కి వచ్చిన సమయంలో వాడో వీడో గొట్టంగాల్ల కోసం నేను డిగ్రీ కాలేజీ ఇవ్వను అంటూ మావిద్యార్థులకోసం ఇస్తున్న అన్నమంత్రి ఇంతవరకు హామీ నెరవేర్చకపోవడంలో విఫలమయ్యారు. రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తున్నాం ఇంకా చేస్తాంమన్నా మాటలు ప్రతి మీటింగులో మాటమాటికి ఊతాపదంలావాడే భాష గల్లిబొల్లి మాటలతో ఎవర్నినమ్మకండి మంత్రి తదితర పార్టీలను విమర్శిస్తారు. ఇవేమీమాటలు మేము అడుగుతున్నామని ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు ముద్ధం రాజు, వెలుముల రాంరెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి, ఆరుట్ల మహేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, పట్టణ అధ్యక్షులు తాళ్ళ విజయ్ రెడ్డి, ఎస్టిసెల్ మండల అధ్యక్షులు గోవర్ధన్ నాయక్, కొమురయ్య, దశరతం, సారుగు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
