రెండో విడత కంటి వెలుగు ప్రారంభం
– గ్రామ సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి
-వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల్ తిమ్మక్క పల్లి గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ను సోమవారం గ్రామ సర్పంచ్ నిర్మల రాజిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ ఇప్ప లక్ష్మి పోచయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుపేన్నడు లేనివిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం సంతోషం కరమని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కంటి వెలుగు భాగంగా అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్లు వార్డు సభ్యులు యువజన నాయకులు గ్రామ నాయకులు రాజ్ రెడ్డి ఇప్ప దయాకర్ తదితరులు పాల్గొన్నారు.




