ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే20, గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన ముస్తాబాద్ సర్పంచి గాండ్ల సుమతి కొత్త ఇంటి నిర్మాణం .నేటి నిరసనతో ఓ కొలిక్కి వచ్చింది. శనివారం సర్పంచి సుమతి అధికార దుర్వినియోగానికి , ఈవో రాజు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ… బిజేపి నాయకులు జిల్లెల్ల ఉపేంద్ర స్థానిక రత్నాలకుంట వద్ద సెల్ టవర్ ఎక్కారు. జిల్లెల ఉపేంద్ర మాట్లాడుతూ … తాను ఈ అక్రమ నిర్మాణంపై గతంలో జిల్లా కలెక్టరుకి ఫిర్యాదు చేసినా అధికారులలో ఎలాంటి స్పందన లేదన్నారు. అంతేకాకుండా తాను కలెక్టరుకి ఫిర్యాదు చేసినందుకు సర్పంచి సుమతి తనపై పరువు నష్టం కేసు నమోదు వేసిందని వాపోయారు. నిబంధనలు మనుషులని బట్టి మారుతాయా అని ఉపేంద్ర ప్రశ్నించారు ఇంత అవినీతి జరుగుతున్నా అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవడంలో కేటీఆర్ విఫలం అయ్యారని కాంగ్రెస్ బిజెపి ఆరోపించారు. ఈసందర్భంగా రాష్ట్ర బీజేపి నాయకులు కనమేని చక్రదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు . స్థానిక ఎంపీడీవో రమాదేవికి ఇక్కడ జరుగుతున్న అవినీతి కనపించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. ఈవో రాజుపై ఇంతకుముందు చాలా అవినీతి ఆరోపణలు ఉన్నా అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం వెనక అధికారుల మతలబు ఏందని ప్రశ్నించారు. సర్పంచి గాండ్ల సుమతి చేస్తున్న అవనీతిని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తున్నట్లు ముస్తాబాద్ మాజీ సర్పంచి ఓరుగంటి తిరుపతి ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన సర్పంచి గాండ్ల సుమతి అవినీతికి పాల్పడటం సరికాదని అన్నారు.




