దౌల్తాబాద్: మండల పరిధిలోని మొండిచింత నుంచి నాచారం గుట్ట వరకు ఆర్ అండ్ బి రోడ్డు గుంతలు గా మారడంతో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని వెంటనే మరమ్మతులు చేయించాలని ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్, మండల ప్రజా ప్రతినిధులు శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రోడ్డు మరమ్మత్తు కోసం నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు స్టీవెన్ రెడ్డి, మల్లేశం పల్లి సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు కుమార్, పూర్ణయ్య, నాగరాజు, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…
