సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ ద్వారా 8 నెలలో క్రితం మిస్సింగ్ అయిన సెల్ ఫోన్ గుర్తింపు. ఎల్లారెడ్డిపేట మండలం, వెంకటాపూర్, గ్రామానికి చెందిన, దుర్గం విజయ్ బాబు 22.04.2023 రోజున పోలీస్ స్టేషన్కు వచ్చి తన యొక్క సెల్ ఫోన్ పోయినది అని ఫిర్యాదు చేయగా, అతని ఫిర్యాదు మేరకు అతని యొక్క సెల్ ఫోన్ IMEI నెంబర్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ లో అప్లోడ్ చేయగా , అట్టి సెల్ఫోన్ దొరికిన వ్యక్తిని గుర్తించి, సెల్ ఫోను స్వాధీనం చేసుకొని, తిరిగి ఫిర్యాదుదారుణకి శనివారం రోజుఎల్లారెడ్డిపేట సర్కిల్ సీఐ మొగిలి చేతుల మీదుగా అందించారు ఇకనుండి ఎవరు సెల్ఫోన్ అయినా మిస్సయినచో వారు నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేసిన, లేదా వారు ఈ యాప్ ద్వారా అప్లోడ్ చేసుకున్న వారి సెల్ ఫోన్ త్వరగా గుర్తించడానికి అవకాశం ఉందని ఎల్లారెడ్డిపేట సిఐ మొగిలి సూచించారు. ఈ యాప్ ను అందరూ వారి వారి సెల్ ఫోన్ లో కూడా వినియోగించుకోవడానికి అవకాశం కలదు
