గంభీరావుపేట మండలం సెప్టెంబర్ 14 తెలుగు 24/7 న్యూస్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని నర్మాల గ్రామంలో వినాయక చవితి సందర్బంగా మట్టి వినాయకులను పూజించి వర్యావరణాన్ని కాపాడాలనిరాష్ట్ర ప్రభుత్వం సూసించడంతో (శాలివాహన )కుమ్మరులు మట్టి వినాయకులను తయారు చేసే పనులలో నిమగ్నమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని నర్మాల గ్రామానికి చెందిన ఆకునూరి శ్రీనివాస్ తన ఇంటి వద్ద మట్టి వినాయకులను తయారు చేస్తున్నారు మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ ద్వారా శిక్షణ ఇచ్చి కులవృత్తులను కాపాడాలనే ఉద్దేశ్యం తో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో గతం లో వరంగల్ లోని గుడ్ల సింగారం లో పది రోజులపాటు ప్రభుత్వ కుమ్మరులు ఫేడరేషన్ పరిధిలో ఉన్న 2076 శాలివాహన సహకార సంఘం తో 31వేల మంది సభ్యులకు మట్టి వినాయకుల తయారీ లో ( శాలివాహన )కుమ్మరులకు శిక్షణ ఇచ్చారన్నారు. ప్రజల పిఓ పి నుండి విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను మొగ్గు చూపడం తో శాలివాహనులువీటిని తయారు చేస్తున్నామని రసాయనాలతో తయారుచేసిన వినాయక విగ్రహాలను వాడడం వల్ల పర్యావరణానికి కలుగడం తో పాటు నీటి కాలుష్యం అవుతుంది అని అన్నారు మట్టి వినాయకులను పూజించడం ద్వారా కులవృత్తుల వారికీ ప్రత్యేక్షంగా పరోక్షంగా ఆర్థిక సహాయం అందించిన వారఅవుతారని వారికీ చేయూతనిచ్చిన మట్టి గణపతి ని పూజించి పర్యావరణాన్ని కాపాడాలనే ప్రభుత్వఉద్దేశ్యంతో మట్టి గణపతులను తయారు చేస్తున్నామని కావలసిన వారు ఫోన్ నంబర్ 9959186211నెంబర్ ను సంప్రదించండి..
