సిద్దిపేట్ మార్చి 2: 24/7 తెలుగు న్యూస్ :ఘనంగా శ్రీపాదరావు జయంతి వేడుకలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన
ప్రముఖ సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి పిడిశెట్టి రాజు.
సిద్దిపేట జిల్లా (హుస్నాబాద్ నియోజకవర్గం / గ్రామపంచాయతీ ) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు, స్వీకర్ దివంగత దుద్ధిళ్ల శ్రీపాదరావు 87వ, జయంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. అనంతరం ప్రయివేట్ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు బ్రేడ్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారత రత్న, మాజీ ప్రధాని దివంగత మహానేత పీవీ నరసింహారావు కి అత్యంత సమీప బంధువుగా, వారి స్పూర్తితో అఖిల భారత కాంగ్రెస్ కమిటి మాజీ కార్యదర్శి గా కీలక నేతగా, ఎమ్మెల్యే గా గెలుపొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదవ శాసనసభ స్పీకర్ గా 1989నుండి 1994 వరకు పనిచేశారు. వీరి హయాంలో మొదటిసారిగా శిశు సంక్షేమ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వారి కుమారుడు శ్రీధర్ బాబు తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ రాష్ట్ర మంత్రిగా ప్రజల మనసు గెలిచిన నాయకుడుగా ప్రఖ్యాతి పొందారు. ఈకార్యక్రమంలో కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నమిలికొండ ఐలయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు వెల్డండి వెంకటరమణ నేత, కట్కోజ్వాల కిషన్ చారి,ఏస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.