ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 17, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో సర్పంచ్ సాకల రమేష్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు కంటి పరీక్షలు చేయించుకొని కంటి సమస్యలు ఉన్నవారు తప్పని సరిగా చేయించుకోవాలని ఉచిత అద్దాలు మందులు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామరావు, ఎంపీటీసీ కొండని బాలకిషన్ మాజి ఏఎంసి చైర్మన్ బత్తుల అంజయ్య, పార్టీ ఉపాధ్యక్షుడు కల్వకుంట్ల శ్రీనివాస్ రావు, వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డికి శాలవతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
