ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే15, తెర్లుమద్ది గ్రామ ఎంపీటీసీ బైతి దుర్గమ్మ (నవీన్ యాదవ్) రైతుల సమక్షంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి పలు సమస్యలు రైతులద్వారా తలెత్తాయని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని గ్రామంలోని రైతులకు అనువైన స్థలం చూసి ఐకేపీ సెంటర్ ప్రారంభించడంతో కుప్పలుగా పోస్తుండగా ప్రైవేట్ భూమి యజమానులు పలురకాల విభేదించడంతో సర్దిచెప్పడంలో నిమగ్నమయ్యారని సమాచారం. రైతులు పండించిన ధాన్యాన్ని సమీపంలోని రహదారి వెంబడి రాసులుగా పోసుకుంటూ రోడ్లపైనే ఆరబోస్తున్నారు. అంతేకాకుండా ప్రధాన రహదారిపై పలురకాల వాహనాలకు ఆటంకం జరిగే రీతిలో ఉన్నావని ఏఒక్క వాహనదారునికి ప్రమాదాల బారిన పడిన అటు వాహనదారునికి రైతులకు పెద్ద మొత్తంలో నష్టపోతారని పలువురు రైతులతో పాటు బైతి నవీను ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు అనువైన స్థలం తెర్లుమద్ది గ్రామ డంపింగ్ యాడ్ వద్ద ప్రభుత్వ భూమి10 ఎకరాలకు పైచిలుకు ఉన్నందున కేవలం 5ఎకరాల స్థలం ఐ.కె.పి సెంటర్కు అధికారులు చొరవ తీసుకుని స్థలం కేటాయించాలని సంబంధిత ముస్తాబాద్ మండల తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు.
