*రామగుండం పోలీస్ కమీషనరేట్*
ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి కి ఘనంగా వీడ్కోలు పలికిన రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది.
పోలీసు అధికారులు, సిబ్బంది వాహనం లాగి వీడ్కోలు.
హోం గార్డ్ ఆఫీసర్ నుండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన సీపీ.
పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో బదిలీ పై వెళ్తున్న ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి కి పోలీసుల గౌరవ వందనాలు సమర్పించి, గజమాలలతో సత్కరించి వాహనంలో సీపీ ని హెడ్ క్వార్టర్స్ గేట్ వరకు కమీషనరేట్ పోలీసు అధికారులందరూ సిబ్బంది వాహనం కు ఏర్పాటు చేసిన తాడును లాగి సాదరంగా వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా బదిలీ పై వెళ్తున్న సీపీ మాట్లాడుతూ…. రామగుండం పోలీస్ కమీషనరేట్ లో పని చేసిన సమయం, చేసిన కార్యక్రమాలు మరువలేనివని ఎంతో తృప్తి నీ ఇచ్చాయని తెలియజేశారు. 13 నెలలపాటు చేసిన సమయంలో సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందికి మరియు సీపీఓ సిబ్బందికి ప్రతి ఒక్కరికి సీపీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కష్టపడుతూ అందరి సమన్వయము తో పార్లమెంటు ఎన్నికలను, వి వి ఐ పి ల కార్యక్రమాలు, పోటీ పరీక్షలు మరియు పండుగలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ లో పని చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. ఇక్కడి ఆఫీసర్లు, సిబ్బంది సమస్వయం, ఒక టీమ్ లాగా అందరూ కలిసి కట్టుగా పని చేయడం బాగుందన్నారు.





