ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో భవన నిర్మాణం పనులను పరిశీలించిన
నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు
ఎల్లారెడ్డిపేట కెడిసిసి బ్యాంకు భవన నిర్మాణం పనులను నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు శనివారం పరిశీలించారు,ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో ఆధ్వర్యంలో భవనం మొదటి అంతస్తులో ప్రస్తుతం కేడీసీసీ బ్యాంకు నిర్వహిస్తున్నారు. బ్యాంకుకు వచ్చే వృద్ధులకు వికలాంగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో వెంటనే స్పందించిన నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ప్రత్యేక నిధులను మంజూరు చేశారు. ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో భవనం గ్రౌండ్ ఫ్లోర్ కేడీసీసీ బ్యాంకు భవన నిర్మాణం
పనులు జరిగిపోతున్నాయిఈ సందర్భంగా కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ ఈ పనులను త్వరలోనే పూర్తి చేసుకొని పై అంతస్తులో ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో కార్యకలాపాలు జరుగుతాయని
ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న కింది భాగంలోకి కేడీసీసీ బ్యాంకు ను మార్చడం జరుగుతుందన్నారు నాణ్యతగా చేయించి త్వరలో పూర్తి చేయించాలని సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డిని నాస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు ఆదేశించారు,
ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిళ్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు బంధారపు బాల్రెడ్డి , పిల్లి కిషన్ , తదితరులు ఉన్నారు
