సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఎల్కల్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం గురువారం ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని కెసిఆర్ వల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని, విద్యావంతుడు మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, స్వంత నిధులతో సేవ చేస్తా అంటూ మన ముందుకు వస్తున్న వెంకట్ రామ్ రెడ్డికి మద్దతుగా నిలిచి కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మల్లేష్, మాజీ సర్పంచ్ శ్యామల కుమార్, మాజీ జల రాజు, ఎరుకలి నాగరాజు తదితరులు ఉన్నారు.




