ప్రాంతీయం

ముస్తాబాద్ మండలంలో ఘోరరోడ్డు ప్రమాదం ఒకరు మృతి…

1,154 Views

 

 

 

 

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే13 ముస్తాబాద్ మండలంలోని గూడెం-నామాపూర్ గ్రామాల మధ్య బైకు లారీని ఢీకొట్టిన సంఘటనలో యువతి అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సడిమల వంశీ వయసు (18సం) వంశీ పెద్దమ్మ కూతులైన అక్కచెల్లెను నారాయణరావుపేట మండలం బంజేర్ పల్లి గ్రామానికి ఓద్విచక్ర వాహనంపై శ్యాగ రుచిత (20), సాహితీ (18) వీరిఇరువురిని దింపడానికి గూడెం గ్రామంనుంచి బంజేర్ పల్లి గ్రామానికి వస్తుండగా నామాపూర్ గూడెం మధ్యలో కెనాల్ కాలువవద్ద మూలమలుపున వడ్ల లారీనీ అతివేగంతో అజాగ్రత్తగా ఢీ కొట్టుకోగా రుచిత అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన సాహితీ, వంశీలను స్థానికుల సహాయంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈసమాచారం అందుకున్న ముస్తాబాద్ ఏఎస్ఐ రమణ సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూశారు. అప్పటికే స్థానికులు గాయపడ్డ వారిని ఎల్లారెడ్డిపేట హాస్పటల్ కు 108 వాహనం ద్వారా తరలించి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *