దివ్యాంగులకు బస్సు పాస్ లు అందజేత
ఆర్టీసీ బస్సులోనే ప్రయాణికులకు ప్రయాణం సురక్షితమని నాచారం సర్పంచ్ శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నాచారం గ్రామానికి చెందిన 22మంది దివ్యాంగులకు ఆయన తన సొంత ఖర్చుతో బస్ పాసులను ఆర్టీసీ. సిబ్బంది స్వాతి జయందేర్ రెడ్డి తో కలిసి పంపిణీ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసమే ఆర్టీసీ బస్సులు నడిపిస్తుందని, ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితంతో పాటు ఆర్టీసీ ప్రజలకు అందించే రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆర్టిసీ ప్రజల అవసరాలకు బస్సులను అద్దెకు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ బి. సురేఖ తదితరులున్నారు.