ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే5, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం గ్రామాల్లో పకడ్భందీగా నిర్వహిస్తున్నట్టు సర్పంచ్ కలకొండ కిషన్ రావు అన్నారు. శుక్రవారం తెరులుమద్ది గ్రామంలో 7రోజులుగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఈశుక్రవారంతో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమంలో సర్పంచ్లు పొరం అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య సిబ్బందిని ఆశా వర్కర్లును ఘనంగా శాలువలతో సత్కరించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమంలో వృద్ధులకు, నిరుపేదలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఈసరి కృష్ణ, కట్ట బాబురావు, ఉప సర్పంచ్ చంద్రయ్య, పార్టీ ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు, వార్డు సభ్యులు బైతి కనకరాజు, ఈర్ల రాజ మల్లయ్య, మామిండ్ల బాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
